KMR: ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మహిళలకు ఉచిత ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ ఖాసీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం అవసరమైన వారికి రక్త పరీక్షలు చేశారు.