ఆల్ రౌండర్ జడేజాకు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పలు సూచనలు చేశాడు. జడేజా తన కెరీర్ కాపాడుకోవాలంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలన్నాడు. బౌలింగ్లో కొత్తగా ప్రయత్నించాలని జడేజాకు ఇదివరకే చాలాసార్లు చెప్పానని, కానీ.. ఆయనకు సర్దిచెప్పడం చాలా కష్టమని అశ్విన్ వెల్లడించాడు. అయితే.. మార్పును స్వీకరించడంలో కోహ్లీ అందరికీ ఆదర్శమని పేర్కొన్నాడు.