ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్లో స్పెయిన్ ఆటగాడు పెడ్రో మార్టినెజ్‌పై గెలిచి, ఈ టోర్నీలో 100వ విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 3 వేర్వేరు గ్రాండ్ స్లామ్లలో 100 మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచ ఏకైక ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈసారి కప్పు గెలిస్తే 25వ టైటిల్‌తో ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తాడు.