TG: HYD జూబ్లీహిల్స్ పీఎస్కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. హరీష్ రావు వెంట పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా, సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించనుంది. అయితే హరీష్ రావు వెంట ఆయన అడ్వొకేట్ను లోపలికి పోలీసులు అనుమతించలేదు.