కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో IELTS ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు 21 నుంచి 23 వరకు బీసీ స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అభ్యర్థులు స్టడీ సర్కిల్ కేంద్రానికి వచ్చేటప్పుడు ఒరిజినల్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ తీసుకురావాలని పేర్కొన్నారు.