TG: రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు కేంద్ర, జాతీయ, జిల్లా స్థాయి సంస్థల ఛైర్ పర్సన్లు, ప్రభుత్వరంగ సంస్థల ఛైర్ పర్సన్లు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఏజెంట్లుగా అనర్హులని తెలిపింది.