VKB: పరిగి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు బహర్పేట్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ వర్గాలు కోరాయి.