KDP: కడపలో సంక్రాంతి పండుగ ముగిసినా సంబరాలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు. కడపలోని ఆమె నివాసంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్కును ఆమె తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. దాదాపు 105 మంది లబ్ధిదారులకు రూ.1.13 కోట్ల చెక్కులను అందించినట్లు తెలిపారు.