ELR: జీలుగుమిల్లిలో 37వ ఇవాళ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. మోటారు వాహన తనిఖీ అధికారి ఎస్.ఎస్. రఘు నాయక్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.