MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువతి ధరావత్ మమత (18) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 16న మమత ఎలుకల మందు సేవించగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వివరించారు. మృతురాలు సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.