TG: సింగరేణి స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణి కోల్ స్కామ్ హరీష్ రావు బయటపెట్టగానే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. రేవంత్ కేసులు, విచారణలకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. రేవంత్ కుంభకోణాలను ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. టెండర్లు వేయకుండా కాంట్రాక్టర్లను రేవంత్ బావమరిది బెదిరించారన్నారు.