MNCL: బీజేపీకి సమస్యలను పరిష్కరించే శక్తి ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నస్పూర్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. సమస్యలను పరిష్కరించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందామని అన్నారు.