NLR: కావలి మండలం రాజు వారి చింతలపాలెం సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి పట్టణంలోని వైకుంఠపురం నుంచి కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారానికి పొగాకు పనుల నిమిత్తం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.