HYD: నగరంలో పెరుగుతున్న నకిలీ ట్రాఫిక్ చలాన్ మోసాలపై వాహనదారులను సీపీ సజ్జనార్ హెచ్చరించారు. మోసగాళ్లు SMS ద్వారా పంపే ఫిషింగ్ లింక్‌లు క్లిక్ చేస్తే, అవి ప్రభుత్వ సైట్ లాంటి నకిలీ వెబ్ సైట్లకు దారి తీసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నాయని, అధికారిక సైట్లు ఎప్పుడూ gov.inతో ముగుస్తాయని గుర్తుచేశారు. SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయవద్దని పేర్కొన్నారు.