అన్నమయ్య: కొత్తకోట సివిల్ సప్లై పరిధిలో వంట గ్యాస్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ ధర రూ.890గా ఉండగా, రూ.960 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ధరలు పెంచడంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.