ASR: కొయ్యూరు మండల తహసీల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్ మంగళవారం మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే గమనించిన రెవెన్యూ సిబ్బంది రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారని సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన మండల వాసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.