ఆదిలాబాద్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమైన సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వ్యాపారస్థులు సహకరించాలని ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ అన్నారు. ఈ విషయమై ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినేశ్ మాటోలియాతో పాటు వ్యాపారస్థులతో సమావేశం నిర్వహించారు. తమ లోడింగ్, అన్ లోడింగ్లను ఉదయం 8లోపు, రాత్రి 8 తరువాతనే చేసుకోవాలన్నారు.