టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు బ్యాటర్ డారిల్ మిచెల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అతడు రెండు సెంచరీల సాయంతో 352 పరుగులు(84, 131, 137) సాధించాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు. ఇక చివరి మ్యాచ్లోనూ భారీ సెంచరీ చేయడంతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.