న్యూయార్క్లో నైటా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సాయి మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా భోగి పండ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు సందడి చేశాయి. మన సంస్కృతిని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ వేడుక నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.