BDK: జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న రైతులకు పొలాలకు వెళ్లే దారి ముళ్ళకంపలతో అధ్వానంగా మారిందని సోమవారం స్థానికులు వెల్లడించారు. కాగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా.. రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.