AP: దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ జ్యూరిక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. లోకేష్‌కు యూరప్ టీడీపీ ఫోరం ప్రతినిధులు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, జై లోకేష్ నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా లోకేష్ ప్రవాసాంధ్రులతో ముచ్చటించి రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కీలకమని కొనియాడారు.