AP: స్విట్జర్లాండ్లో సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్విట్జర్లాండ్లోని కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధన అవకాశాలపై చర్చించారు. ఏపీకి పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని మృదుల్కుమార్ను సీఎం కోరారు. ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ రంగాల్లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.