KMR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గురు ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల అభ్యున్నతి కోసమే పాటుపడుతుందన్నారు.