HYD: అమీన్పూర్ పెద్దచెరువు FTL, బఫర్ జోన్ హద్దులను వెంటనే నిర్ధారించాలని బాధితులు హైడ్రాను కోరారు. సోమవారం జరిగిన ‘ప్రజావాణి’లో కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు 43 ఫిర్యాదులు అందాయి. చెరువు నీటిమట్టం పెరుగుతుండటంతో తమ ఇళ్లు, ప్లాట్లు మునుగుతున్నాయని, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని వారు వాపోయారు.