రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈనెల 9న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోందని ట్రేడ్ వర్గాల అంచనా. ప్రస్తుతం థియేటర్లలో ఆక్యుపెన్సీ 20% కంటే తక్కువగా ఉంది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.90 కోట్లు(NET) రావాల్సి ఉండగా, సినిమా బిజినెస్ 55% రికవరీతోనే ముగిసే అవకాశం ఉంది. అటు ఓటీటీ డీల్ ఆశించిన స్థాయిలో జరగలేదని సమాచారం.