TG: గూడ్స్ వాహనదారులకు ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రవాణా రంగంలో ఏళ్లుగా ఇబ్బందికరంగా మారిన త్రైమాసిక పన్ను విధానానికి స్వస్తి పలకాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే గూడ్స్ రవాణా వాహనాలకు ప్రతీ మూడు నెలలకోసారి పన్ను కట్టాల్సిన పనిలేదు. దీనికి బదులుగా వాహనం కొనుగోలు సమయంలోనే ఒకేసారి లైఫ్ ట్యాక్స్ వసూలు చేయనుంది.