TG: తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి బయటపడుతుందనే తమకు నోటీసులు ఇచ్చారని అన్నారు. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో.. తమకు నోటీసులు ఇచ్చారని ఉద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల్లో డైవర్షన్ కోసమే.. రేవంత్ రెడ్డి ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.