టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఆడిషన్స్ సమయంలో ఓ దర్శకుడు తన మోచేతులు నల్లగా ఉన్నాయని కామెంట్ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. దానికి తాను.. ‘నేను ఎలా పుట్టానో అలాగే ఉంటాను కదా.. దాన్ని మార్చలేను’ అంటూ సమాధానం ఇచ్చానని తెలిపారు. ఇండస్ట్రీలో ఉండే బాడీ షేమింగ్ గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.