NGKL: ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 8 న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.