TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును రేపు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ముందుగా ఆయన రేపు తెలంగాణ భవన్కు రానున్నారు. ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుకుని కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచే ఆయన సిట్ విచారణకు వెళ్లనున్నారు.