AP: రాష్ట్రంలో చేనేత కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదలయ్యాయి. 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమయ్యాయి. త్రిఫ్ట్ ఫండ్ నిధులతో 5,726 నేతన్నలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి సవిత వెల్లడించారు. నేతన్నలకు రెండు నెలల్లో రూ.9 కోట్లు అందించామని అన్నారు. చేనేతరంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు.