TG: బొగ్గు గనుల కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. తమకు చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, ఏ విచారణకైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. విచారణల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని వ్యాఖ్యానించారు.