KNR: విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్‌కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.