TG: సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ స్పీకర్ మధుసూధనాచారీ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి తప్పు చేయాలేదని.. చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు.