TG: రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఇవాళ్టితో ముగియనుంది. టెట్ పేపర్ 1,2 లకు కలిపి మొత్తం 2.38 లక్షల మంది దరఖాస్తు చేశారు. సగటున 80శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లు 71,670 మంది దరఖాస్తు చేయడం గమనార్హం. పరీక్ష ఫలితాలు వచ్చే నెల 10-16 తేదీల మధ్య వెల్లడవుతాయి.