ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే శరీరంలో అనేక సానుకూల మార్పులకు కారణమవుతుంది. బొప్పాయిలో సహజంగా ఉండే ఎంజైములు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. పేగులలో పేరుకుపోయిన మలాన్ని మృదువుగా చేసి బయటకు పంపేందుకు సహాయపడుతుంది. తరచుగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి సహజ పరిష్కారంగా చెప్పవచ్చు. ఉదయం తినే బొప్పాయి పేగుల పనితీరును క్రమంగా సరిచేస్తుంది.