MDK: కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన దేశాయిపేట గణేష్ శర్మ (28) నిన్న బాత్రూంలో పడి మృతి చెందాడు. హైదరాబాదులో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న గణేష్ శర్మ అక్కడే ఉంటున్నాడు. సోమవారం బాత్రూంలో పడగా, ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గణేష్ శర్మ మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. గణేష్ శర్మ అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.