ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు ఆలయానికి వచ్చి అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ప్రాతఃకాల దర్శనంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.