GNTR: గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా ఘనవిజయం సాధించడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. 11 రోజుల్లోనే 13 లక్షల మంది సందర్శకులు ఈ మేళాను సందర్శించగా, రూ.25 కోట్లకు పైగా వ్యాపారం జరగడం విశేషమని ట్వీట్ చేశారు. 320 స్టాళ్ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారని, ఇది వారి ఆర్థిక స్వయం సమృద్ధికి నిదర్శనమన్నారు.