TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. లొట్టపీసు కేసు అని మాజీమంత్రి KTR విమర్శించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును.. సిట్ విచారణ అంటూ సాగదీస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కంటే సిట్ పెద్దదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెడితే.. హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఉద్ఘాటించారు. విచారణ, నోటీసుల పేరుతో తమ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.