MDK: శివంపేట్ మండలం రూప్లతండాలో తాగునీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. కోట్ల రూపాయలతో అమలైన మిషన్ భగీరథ పథకం ఉన్నా గ్రామానికి మాత్రం చుక్క నీరు అందడం లేదు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మిషన్ భగీరథ నీటిని గ్రామానికి అందించి ఈ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.