TG: హైదరాబాద్‌లో ఆరుగురు మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన విద్యార్థులు గంజాయితో పట్టుబడినట్లు తెలుస్తోంది. వారి నుంచి రెండు కిలోల గంజాయి, 1.5 లీటర్ల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ఎస్ఓటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.