నిర్మల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ ముద్రించిన క్యాలెండర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రజల మధ్య మరింత బలంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.