GNTR: నిడుబ్రోలు 11వ వార్డులోని మౌలిక వసతులను పొన్నూరు పురపాలక కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు మంగళవారం స్వయంగా పరిశీలించారు. రోడ్లు, కాలువల దుస్థితిపై స్థానికులు అందించిన విజ్ఞప్తులపై స్పందించిన ఆయన, దెబ్బతిన్న కల్వర్టులను వెంటనే పునరుద్ధరించాలని, సీసీ రోడ్ల పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.