JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారక్క జాతర సమీపిస్తున్నందున భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేకువజాము నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారి సేవలో తరిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అదనపు ప్రసాద కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.