కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు తాపడాల అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అధికారులు కేరళ, కర్ణాటక, తమిళనాడులో సోదాలు చేస్తున్నారు. 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సోదాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.