హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.950 పెరిగి రూ.1,35,000 వద్ద ఉంది. ఇక వెండి ఏకంగా రూ.12,000 పెరిగి కిలో రూ.3,30,000కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.