TG: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు-2026లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ చేరుకుంది. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.