సీనియర్ స్పిన్నర్ అశ్విన్, జడేజాకు కీలక సూచనలు చేశాడు. జడేజా తన కెరీర్ కాపాడుకోవాలంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని అన్నాడు. బౌలింగ్లో కొత్తగా ప్రయత్నించాలని తాను చాలాసార్లు చెప్పినా, జడేజాకు సర్దిచెప్పడం కష్టమని అశ్విన్ వెల్లడించాడు. మార్పును స్వీకరించడంలో కోహ్లీ ఆదర్శమని, జడేజా కూడా అప్డేట్ అవ్వాలని అశ్విన్ హితవు పలికాడు.