ATP: పామిడి పట్టణంలో మంగళవారం అంకాలమ్మ, కుంటేమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయంలో అమ్మవార్లకి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాతరలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.